Umar Alisha Rural Development Trust

Service to humanity is service to God

ది. 11 ఆగష్టు 2019 ఆదివారం ఎల్. అగ్రహారం గ్రామం, తాడేపల్లిగూడెం రూరల్, పశ్చిమ గోదావరి జిల్లా లో “నా మొక్క నా శ్వాస – రేపటి తరం కోసం” కార్యక్రమము నిర్వహించబడినది

ది. 11 ఆగష్టు 2019 ఆదివారం ఎల్. అగ్రహారం గ్రామం, తాడేపల్లిగూడెం రూరల్, పశ్చిమ గోదావరి జిల్లా లో “రేపటి తరం కోసం నా మొక్క నా శ్వాస” కార్యక్రమము నిర్వహించబడినది. పర్యావరణ ప్రేమికులు, ప్రకృతి పరిరక్షించు కోవాలనే హితం కోరేవారందరూ మొక్కలను నాటి బతికించాలని తాడేపల్లిగూడెం ఉప ఖజానాధికారి, పిఠాపురం ఉమర్ ఆలీషా పీఠం సభ్యులు శ్రీ గారపాటి గారపాటి గోపాలరావు గారు ఉధ్బోధించారు. రూరల్ మండలంలోని ఎల్.అగ్రహారం గ్రామంలో రహదారి కిరువైపులా ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ గోపాలరావు గారి నిర్వహణలో ఆదివారం మొక్కలను నాటారు. యస్.టి.వో శ్రీ గోపాలరావు గారు మాట్లాడుతూ తమ సద్గురువర్యులు శ్రీ డాక్టర్ ఉమర్ ఆలీషా గారి ఆదేశాల మేరకు 500 మొక్కలు నాటాలని లక్ష్యంతో గ్రామాల్లో అవసరమైన ప్రదేశాలలో మొక్కలు నాటుతున్నట్లు చెప్పారు. తాడేపల్లిగూడెం తాలూకా ఎన్.జి.ఓ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ డి.శామ్యుల్ రాజు గారు మాట్లాడుతూ మొక్కలు చేసే ఉపకారాన్ని కన్న బిడ్డలు కూడా చేయరని కితాబిచ్చారు. గ్రామ కార్యదర్శి శ్రీ వై.కిషోర్ గారు, అలంపురం హెచ్.ఎం శ్రీ ఎ.వి.రామరాజు గారు, ఎన్.జీ.ఓ అసోసియేషన్ సెక్రటరీ శ్రీ సి.హెచ్.వి.వి.డి ప్రసాద్ గారు, ఉపాధ్యక్షులు శ్రీ యం.సునీల్ కుమార్ గారు, ఉపాధ్యాయులు శ్రీ పి.రాజు గారు, పీఠం సభ్యులు శ్రీ కట్రెడ్డి షాబాబు గారు, శ్రీ దంగేటి రామకృష్ణ గారు, యల్ అగ్రహారం పీఠం కన్వీనర్ శ్రీ దారపురెడ్డి వెంకన్నగారు, ఏరియా కన్వీనర్ శ్రీ బి.శ్రీ నివాసరావు గారు, శ్రీ పొప్పొప్పుల రామకృష్ణ గారు, ఆరాధనా కమిటీ కన్వీనర్ శ్రీ దారపురెడ్డి చంద్ర గారు, వి.ఆర్.వో శ్రీ ఆదాము రాజు గారు, గ్రామ పెద్ద శ్రీ కొత్తపల్లి ప్రసాద్ గారు తదితరులు పాల్గొన్నారు.

ది 11 ఆగష్టు 2019 ఆదివారం ఎల్. అగ్రహారం గ్రామం, తాడేపల్లిగూడెం రూరల్, పశ్చిమ గోదావరి జిల్లా లో "నా మొక్క నా శ్వాస - రేపటి తరం కోసం" కార్యక్రమము నిర్వహించబడినది

ది 11 ఆగష్టు 2019 ఆదివారం ఎల్. అగ్రహారం గ్రామం, తాడేపల్లిగూడెం రూరల్, పశ్చిమ గోదావరి జిల్లా లో "నా మొక్క నా శ్వాస - రేపటి తరం కోసం" కార్యక్రమము నిర్వహించబడినది

Video

Paper Clippings

Umar Alisha Rural Development Trust © 2015