Umar Alisha Rural Development Trust

Service to humanity is service to God

Coronavirus preventive medicine distributed by UARDT at Town Police Station, Tadepalligudem on 19-March-2020

Umar Alisha Rural Development Trust has distributed Coronavirus preventive Homeo medicine for free to 450 (Director of Police, SI and Police staff) at Town Police Station, Tadepalligudem on 19-March-2020.

కరోనా వైరస్ అవగాహన మరియు హోమియో వ్యాధి నిరోధక మందులు పంపిణీ
శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి డా౹౹ ఉమర్ ఆలీషా సద్గురు వర్యుల ఆదేశాలమేరకు డా౹౹ ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ది 19-3-2020 గురువారం తాడేపల్లిగూడెం టౌన్ సి.ఐ శ్రీ ఆకుల రఘు గారి సమక్షంలో కరోనా వైరస్ అవగాహన సదస్సు మరియు వ్యాధి నిరోధక మందులను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో సి.ఐ శ్రీ ఆకుల రఘు గారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చేతులు శుభ్రంగా కడుక్కోవాలని వ్యక్తి గత శుభ్రత పాటించాలని దగ్గు, తుమ్ము వచ్చినప్పుడు చేతి రుమాలు అడ్డు పెట్టుకోవాలని, కర చలనం చేయకూడదని కరోనా వైరస్ రాకుండా ముందుగా ఈ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ సదస్సులో కవి సాహితీవేత్త శ్రీ యస్.ఆర్ భల్లాం గారు మాట్లాడుతూ శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ముఖ్య ఆశయాలైన 1.ఆధ్యాత్మికత 2.సామాజిక సేవ. ఈ సామాజిక సేవలో భాగంగా కరోనా వ్యాధి నిరోధక మందులను పంపిణీ చేయడం ముదాహవం అన్నారు. తాడేపల్లిగూడెం ఎస్.టి.ఓ శ్రీ గారపాటి గోపాలరావు గారు మాట్లాడుతూ సద్గురు వర్యులు ఆధ్యాత్మిక తత్త్వాన్ని బోధిస్తూ, కరోనా వ్యాధి నిరోధక మాత్రలు ఎలా వినియోగించాలో వివరించి సి.ఏ కార్యాలయ పరిధి లొ 450 మందికి కరోన మందులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పీఠం సభ్యులు శ్రీ కట్రెడ్డి షాబాబు గారు, తాడేపల్లిగూడెం ఎస్.ఐ శ్రీ కె.గుర్రయ్య గారు, ఎస్.ఐ శ్రీ ఎస్.యెన్.వి.వి రమేష్ గారు మరియు తాడేపల్లిగూడెం ట్రాఫిక్ ఎస్.ఐ శ్రీ సి.హెచ్.వి. రమేష్ గారు, ఎస్.ఐ – 2 శ్రీ జి.జె ప్రసాద్ గారు తదితరులు పాల్గొన్నారు.

Coronavirus preventive medicine distributed by UARDT at Town Police Station, Tadepalligudem on 19-March-2020

If you are interested to be part of this noble cause please use following link SBI – Online Donation to send your donations.

For more details please visit https://www.uardt.org/coronavirus/

Umar Alisha Rural Development Trust © 2015