Umar Alisha Rural Development Trust

Service to humanity is service to God

24 ఏప్రిల్ 2019 న “ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్” వారు గోరఖ్పూర్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారి రెండు చలివేంద్రములను ఏర్పాటు చేసినారు.

24 ఏప్రిల్ 2019 న “ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్” వారు గోరఖ్పూర్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి చలివేంద్రమును ఉదయం 11 గంటలకు హాజీపూర్ మెయిన్ బజార్ లో మరియు రెండవ చలివేంద్రమును షాబ్గూంజ్, మిర్చి మార్కెట్ లో ఏర్పాటు చేసినారు. ఈ చలివేంద్రములను గోరఖ్పూర్ మేయర్ శ్రీ సీతారాం జైస్వాల్ గారు ప్రారంభోత్సవము చేసినారు. దైనిక్ జాగరణ్ పాత్రికేయులు, పీఠం సభ్యులు మరియు సభ్యేతురులు ఈ కార్యక్రమములలో పాల్గొన్నారు.

20 ఏప్రిల్ 2019 న “ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్” వారు అత్తిలి, రైల్వే స్టేషన్ లో చలివేంద్రమును ఏర్పాటు చేసినారు.

20 ఏప్రిల్ 2019 న “ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్” వారు అత్తిలి, పశ్చిమ గోదావరి జిల్లా రైల్వే స్టేషన్ లో ఏర్పాటు చేసిన చలివేంద్రమును ఎం.డి.ఓ శ్రీ కె.ఎస్.ఎస్ సుబ్బారావు గారు ప్రారంభోత్సవము చేసినారు. ఈ చలివేంద్రమును మైయిపాల గంగాధర్ గారు ఏర్పాటు చేసినారు. ఈ కార్యక్రమములో పశ్చిమ గోదావరి జిల్లా పీఠం సభ్యులు మరియు సభ్యేతురులు పాలుగొనినారు.  

19 ఏప్రిల్ 2019 న “ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్” వారు పెద్దమ్మ గారు శ్రీమతి జహీరాబేగం గారి పేరున శాశ్వత చలివేంద్రము హైదరాబాద్ లో ఏర్పాటు చేసినారు.

19 ఏప్రిల్ 2019 న “ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్” వారు పెద్దమ్మ గారు శ్రీమతి జహీరాబేగం గారి పేరున శాశ్వత చలివేంద్రము, శ్రీమతి కె.స్వర్ణలత గారి ఇంటి దగ్గర, ప్లాట్ నెం.65, జలవాయువిహార్ కాలనీ, హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన చలివేంద్రమును శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠము, పీఠాధిపతి సద్గురువర్యులు డాక్టర్ ఉమర్ ఆలీషా గారు ప్రారంభోత్సవము చేసినారు. ఈ కార్యక్రమములో హైదరాబాద్ పీఠం సభ్యులు మరియు సభ్యేతురులు పాలుగొనినారు.

18 ఏప్రిల్ 2019 న కాకినాడ బోట్స్ క్లబ్ వద్ద “ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్” వారు పక్షుల చలివేంద్రం, మజ్జిగ చలివేంద్రం మరియు పశువుల చలివేంద్రం కేంద్రాలు ఏర్పాటు చేసినారు

18 ఏప్రిల్ 2019 న కాకినాడ బోట్స్ క్లబ్ వద్ద “ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్” వారు ఏర్పాటు చేసిన పక్షుల చలివేంద్రం, మజ్జిగ చలివేంద్రం మరియు పశువుల చలివేంద్రం కేంద్రాల ను డాక్టర్ ఉమర్ అలీషా గారు మరియు శ్రీమతి సుంకర పావని గారు ప్రారంభోత్సవము చేసినారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమములో డాక్టర్ ఉమర్ అలీషా గారు, కాకినాడ మేయర్ శ్రీమతి సుంకర పావని గారు, వారి భర్త తిరుమల కుమార్ గారు, శ్రీ బన్వర్లాల్ […]

హైదరాబాద్ లోని వివిధ ప్రదేశాలలో ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ వారు 2019 చలివేంద్ర కేంద్రాలు ఏర్పాటు చేసినారు

హైదరాబాద్ లో ని JNTU, లింగంపల్లిలో పోలీస్ స్టేషన్ ఎదురుగా, లింగంపల్లిలో బి హెచ్ ఇ ఎల్ సర్కిల్ బస్ స్టాప్ వద్ద, గంగారం R.S.బ్రదర్స్ షాపింగ్ కాంప్లెక్స్ ఎదురుగా, మియాపూర్ క్రాస్ రోడ్స్, జీడిమెట్ల, AWHO వేదవిహార్, ప్యాట్నీ సెంటర్ ప్రదేశాలలో ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ వారు 2019 చలివేంద్ర కేంద్రాలు ఏర్పాటు చేసినారు. JNTU –  18 మార్చి 2019 లింగంపల్లిలో పోలీస్ స్టేషన్ ఎదురుగా –  24 మార్చి 2019 లింగంపల్లిలో బి […]

Umar Alisha Rural Development Trust © 2015