Umar Alisha Rural Development Trust has distributed Coronavirus preventive Homeo medicine for free to 6500 people at Kondandaramalayam, Visakhapatnam on 17-March-2020.
కరోనా వైరస్ వ్యాధి నిరోధక హోమియోపతి మందుల పంపిణీ
ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ – పిఠాపురం వారి ఆధ్వర్యములో తేదీ : 17-3-2020 మంగళవారం విశాఖపట్నం, కనకమహాలక్ష్మి అమ్మవారి గుడి రోడ్ లో గల కోదండరామాలయం వద్ద సుమారు 6500 మందికి కరోనా వైరస్ వ్యాధి నిరోధక హోమియోపతి మందుల పంపిణీ కార్యక్రమము నిర్వహింపబడినది.
ఈ సందర్భముగా ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కన్వీనర్ డాక్టర్ ఆనంద కుమార్ పింగళి గారు మాట్లాడుతూ: కరోనా వైరస్ ను ఎదురుకోవాలంటే ఆ వ్యాధిపట్ల అవగాహనా చాలా అవసరమని, వ్యక్తిగత పరిశుభ్రత తో పాటుగా వ్యాధి నిరోధక హోమియోపతి మందులు వాడటం వలన మనలో రోగనిరోధక శక్తి పెరుగుతుందని, దానివలన వైరస్ మనలో ప్రవేశించినా దానిని సులభంగా ఎదురుకోగలమని అన్నారు. హోమియోపతిక్ నిరోధక ఔషధం సురక్షితమైనదని ఇది శిశువులు, గర్భిణీ స్త్రీలు మరియు వృద్ధులతో సహా అందరూ తీసుకొనవచ్చు నని, ప్రతిరోజు ఉపయోగిస్తున్న ఇతర సాధారణ ఔషధాలతో పాటు దీనిని ఉపయోగించవచ్చునని అన్నారు. ఇప్పటి వరకు ఉభయ తెలుగు రాష్ట్రాలలో సుమారు ఎనిమిది లక్షల మందికి పైగా ఈ వ్యాధి నిరోధక గోళీలు పంపిణి చేసి, వ్యాధి పట్ల అవగాహన కల్పించామని అన్నారు. ఎవరికైనా సందేహాలు ఉన్నచో “కరోనా హోమియో హెల్ప్ లైన్ నెంబర్ 9866388979 ” నందు సంప్రదించవచ్చు అన్నారు.
ఈ కార్యక్రమములో ట్రస్ట్ కార్యకర్తలు శ్రీ ఎ. ఆచారి గారు, శ్రీ మంజుల గారు, శ్రీ పి. వి రామ రెడ్డి గారు, శ్రీ ప్రకాష్ గారు, శ్రీ గిరీష్ గారు పాల్గొన్నారు.
News Clipping
If you are interested to be part of this noble cause please use following link SBI – Online Donation to send your donations.
For more details please visit https://www.uardt.org/coronavirus/