ప్రెస్ నోట్ 24-3-24 పిఠాపురం
జీవ వైవిద్యం కాపాడుకొనుట ద్వారా మానవ మనుగడ సుఖ శాంతులతో గడప వచ్చని పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి అన్నారు. 24-3-24 ఆదివారం మధ్యాహ్నం పిఠాపురం లో స్థానిక శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమంలో ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అధ్వర్యంలో పక్షుల చలి వేంద్రాన్ని పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా వారి అమృత హస్తాలతో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పీఠం సెంట్రల్ కమిటీ సభ్యులు Dr పింగళి ఆనంద్ కుమార్, శ్రీ N T V ప్రసాద వర్మ, శ్రీ లంకపల్లి అశోక్, పీఠం న్యాయ సలహాదారు శ్రీమతి మంజుల, పీఠం కమిటీ సభ్యులు శ్రీ రేఖా ప్రకాష్, శ్రీ చిర్ల వెంకట రెడ్డి పెద్ద సంఖ్యలో ట్రస్ట్ కార్యకర్తలు పాల్గొన్నారు. పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి వారు మాట్లాడుతూ వేసవి ని దృష్టిలో పెట్టుకొని పక్షులకు ఆహారంగా పలు ధాన్యాలను, మంచినీటి సౌకర్యాన్ని పక్షుల చలి వేంద్రం లో ఏర్పాటు చేశామని అన్నారు. ఎండలు పెరుగు తున్నందున ఈ వేసవిలో ఉమర ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా ఉభయ తెలుగు రాష్ట్రాలలో అనేక మజ్జిగ, మంచి నీటి చలివేంద్రాలు ఏర్పాటు చేస్తామని అన్నారు. సృష్టిలో మానవాళి తో పాటు సకల జీవరాశి మనుగడ సాగించే విధంగా జీవ వైవిధ్యం కొరకు పాటు పడాలని డా. ఉమర్ ఆలీషా స్వామి వారు పిలుపు నిచ్చారు.
ఇట్లు
Dr పింగళి ఆనంద్ కుమార్,
సెక్రటరీ, ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్,
పిఠాపురం.
Ph.9866388979
News Clippings