Umar Alisha Rural Development Trust

Service to humanity is service to God

Free Homeo Medical Service started in Adikavi Nannaya University |9th August 2023

ఆదికవి నన్నయ యూనివర్సిటీ డాక్టర్ వినయ్ సుంకర హెల్త్ సెంటర్ లో ఉచిత హోమియోపతి వైద్య కేంద్రాన్ని వీసీ ఆచార్య కె.పద్మరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ పిఠాపురం వారి సౌజన్యంతో ఫ్రీ హోమియోపతిక్ మెడికల్ సర్వీస్ ను ప్రారంభించామని అన్నారు. యూనివర్సిటీ హెల్త్ సెంటర్ లోని ప్రతి బుధవారం ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు నిష్ణాతులైన వైద్య బృందం అందుబాటులో ఉంటారని చెప్పారు. విశ్వవిద్యాలయ విద్యార్థులతో పాటు అధ్యాపక అధ్యాపకేతర సిబ్బందికి వైద్య, మందులు ఉచితంగా ఇస్తారని అన్నారు. హోమియోపతి వైద్యంలో అపార అనుభవం కలిగిన ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ సభ్యులు ప్రొఫెసర్ డాక్టర్ ఆనందకుమార్ పింగళి, ప్రొఫెసర్ డాక్టర్ ఎస్. ఆనందరావు లు హోమియోపతి వైద్యకేంద్రాన్ని నిర్వహిస్తారని చెప్పారు. విశ్వవిద్యాలయ విద్యార్థులకు ఉచితంగా హోమియోపతి వైద్యసేవలందించేందుకు ముందుకు వచ్చిన ఉమర్ అలీషా మరియు ట్రస్ట్ సభ్యులకు వీసీ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం వైద్యులను, అధికారులను సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య టి.అశోక్, డా.పి.విజయనిర్మల మరియు విశ్వవిద్యాలయ అధికారులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

https://public.app/video/sp_6q0ec5kim5thc

Umar Alisha Rural Development Trust © 2015