Press note. 13-4-23
మండుటెండ లో దాహార్తిని తీర్చేందుకు శీతల చలి వేంద్రము సేవలు ప్రజలు అందరూ సద్వినియోగ పర్చుకొండి అని పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా అనుగ్రహ భాషణ చేశారు. గురువారం ఉదయం స్థానిక పిఠాపురం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం, నూతన ఆశ్రమ ప్రాంగణం ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద, ఉమర్ ఆలషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన శీతల చలి వెంద్రం ను, పక్షుల చలివెంద్రం ను పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి ఆవిష్కరించారు. పంచ భూతాలలో ఒక్కటి నీరు వృథా చేయ వద్దు. నీటి నిల్వలు పరిరక్షించు కావాలని పిలుపు నిచ్చారు. భవిష్యత్ లో నీటి యుద్ధాలు రాకుండా ఉండాలంటే నీటిని వృథా చేయకుండా, నీటిని సంరక్షించు కావాలని డా ఉమర్ ఆలీషా అన్నారు. ఈ కార్యక్రమంలో పీఠాధిపతి సోదరులు అహ్మద్ ఆలీషా, హుస్సేన్ షా, పీఠం సెంట్రల్ కమిటీ సభ్యులు శ్రీ పేరూరి సూరిబాబు,AVV సత్యనారాయణ,NTV ప్రసాద వర్మ, ఇతర కమిటీ సభ్యులు శ్రీ AN వెంకట రత్నం, శ్రీ MRK రాజు, శ్రీ పుల్లా కల్కి మూర్తి, పెదపూడి చంటి, రేఖా ప్రకాష్, రేకా సత్యనారాయణ, పెనుమల్లు రామా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వాలంటీర్లకు, స్త్రీ మూర్తులకు స్వామి చల్లని మంచి నీళ్లు ముందుగా అందచేశారు.
ఇట్లు
పేరూరి సూరిబాబు,
పీఠం కన్వీనర్.
9848921799.
https://www.instagram.com/p/CrBmjyvvpsP/?igshid=YmMyMTA2M2Y=