Umar Alisha Rural Development Trust

Service to humanity is service to God

14-04-2023 న కాకినాడ బోట్ క్లబ్ వద్ద గల కవిశేఖర డా. ఉమర్ ఆలీషా స్వామి వారి విగ్రహం ప్రాంగణం లో పీఠాధిపతి బ్రహ్మర్షి సద్గురు డా. ఉమర్ ఆలీషా వారు చలివేంద్రాన్ని ప్రారంభించారు

Press note. 14-4-23
పక్షుల, పశువుల చలివేoద్రములు స్థాపించి జీవ వైవిధ్యాన్ని పరిరక్షించాలని పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి పిలుపు నిచ్చారు. శుక్రవారం ఉదయం 10.15 నిముషాలకు కాకినాడ బోట్ క్లబ్ వద్ద గల కవిశేఖర డా. ఉమర్ ఆలీషా స్వామి వారి విగ్రహం ప్రాంగణం లో, ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మజ్జిగ చలివెంద్రం, పక్షుల చలివెంద్రం, పశువుల చలివెంద్రములను పీఠాధిపతి డా ఉమర్ ఆలీషా స్వామి ఆవిష్కరించారు. ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా జాతీయ రహదారిపై వెళ్తున్న ప్రజల దాహార్తిని తీర్చడానికి మజ్జిగ చలివెంద్రం, పక్షుల దాహార్తి మరియు ఆహారం సమకూర్చడానికి పక్షుల చలి వెంద్రం, పశువుల దాహార్తిని తీర్చేందుకు పశువుల చలి వెంద్రం ఏర్పాటు చేసి నట్లు డా. ఉమర్ ఆలీషా తెలియ చేశారు. భవిష్యత్ లో నీటి యుద్దాలు రాకుండా ఉండాలంటే,పంచభూతాలలో ఒక్కటైన నీటిని వృథా చేయకుండా, నీటి నిల్వలను పరిరక్షించాలని డా ఉమర్ ఆలీషా స్వామి పిలుపు నిచ్చారు. పంచ భూతాలను కలుషితం కాకుండా కాపాడు కుంటే మానవుడు ఆరోగ్యంగా జీవించడానికి అవకాశం ఉందని డా. ఉమర్ ఆలీషా అన్నారు. ఈ కార్యక్రమంలో JNTU VC Dr GVR Prasada Raju, JNTU director Dr మురళీకృష్ణ, జైన్ merchant’s అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ భవర్ లాల్ జైన్, ఆకృతి షో రూం ప్రొప్రిటర్ శ్రీ విజయ్ జైన్, కవి శిరీష, పీఠాధిపతి సోదరుడు శ్రీ హుస్సేన్ షా ముఖ్య అతిథులుగా విచ్చేసి మూడు చలి వెంద్రాల అవిషిష్కరణలో పాల్గొన్నారు. శ్రీ భవర్ లాల్ జైన్, విజయ్ జైన్ గార్లు పీఠాధిపతి డా ఉమర్ ఆలీషా స్వామి వారిని ముత్యాల దండలు వేసి, శాలువాలతో సత్కరించారు. పక్షుల చలి వెంద్రం ఏర్పాట్లు చూసి, శ్రీ ప్రసాద్ రాజు గారు, మురళి కృష్ణ గారు ఆనంద పరవశులయ్యారు. ఈ కార్యక్రమంలో పీఠం కన్వీనర్ శ్రీ పేరూరి సూరిబాబు, సెంట్రల్ కమిటీ మెంబర్ శ్రీ AVV సత్యనారాయణ, శ్రీమతి మండా ఏల్లమాంబ, శ్రీ K. వీరభద్రరావు, యువ ప్రతినిధి మహేంద్ర వర్మ, శ్రీ మరిసే నాగేశ్వర రావు, శ్రీ అమటం సీతా వరలక్ష్మి , రెడ్డి సూర్య ప్రభావతి తదితరులు పాల్గొన్నారు. అతిథులకు, కమిటీ సభ్యులకు స్వామి చల్లని మజ్జిగ అందచేశారు.
ఇట్లు
పేరూరి సూరిబాబు,
పీఠం కన్వీనర్,
9848921799.

Peetadhipathi Dr. urges to establish cooling centers for birds and animals to protect the biodiversity. Umar Alisha Swamy has given the call. Kavishekhara Dr at Kakinada Boat Club at 10:15 am on Friday. Buttermilk cooling center, bird cooling center and cattle cooling center arranged by Umar Alisha Rural Development Trust by Chairman Dr. Inaugurated by Umar Alisha Swamy. Dr. Umar Alisha Rural Development Trust has set up buttermilk refrigeration center, birds thirst and food to quench the thirst of the people travelling on national highway by Umar Alisha rural development trust. Umar Alisha has made it known. To avoid water wars in the future, Dr. says that water reservoirs should not be wasted in one of the five ghosts. Umar Alisha Swamy has given the call. Dr. says that if the five ghosts are protected from contamination, there is a chance for humans to live healthy. Umar alisha said this. Jay at this event. N. T. U. Vice Chancellor (V. C. ) Dr. G. V. R Prasad Raju, J. N. T. U. Director Dr. Muralikrishna, President of Jain Merchants Association Shri Bhawarlal Jain, Aakruti showroom proprietor Shri Vijay Jain, poet Sirisha, Pitadhipat brothers Shri Hussain Shah visited as chief guests and inaugurated the three cooling centers. Sri Bhavarlal Jain, Vijay Jain garu, Peetadhipathi Dr. Umar Alisha Swamy was honored with pearl salutes and shawls. Sri Prasad Raju garu and Murali Krishna garu became happy after seeing the arrangements of cooling center for birds.

https://www.instagram.com/p/CrBnzJJvUQi/?igshid=YmMyMTA2M2Y=

https://m.facebook.com/story.php?story_fbid=pfbid02zdQ7C7TSYj2MwB7yjNNVFja2xrdN3s6zwqSzU8Y9hxXv6qURs9Ek5vY45JMBGKxYl&id=100069638887718&mibextid=Nif5oz

Umar Alisha Rural Development Trust © 2015