Umar Alisha Rural Development Trust

Service to humanity is service to God

Coronavirus preventive medicine distributed by UARDT at A.P.S.R.T.C Regional Manager Office, Visakhapatnam on 21-March-2020

Umar Alisha Rural Development Trust has distributed Coronavirus preventive Homeo medicine for free to 16,500 people at A.P.S.R.T.C Regional Manager Office, Visakhapatnam on 21-March-2020.

To
The Editor
ప్రెస్ / ఎలక్ట్రానిక్ మీడియా

కరోనా వైరస్ వ్యాధి నిరోధక హోమియోపతి మందుల పంపిణీ

ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ – పిఠాపురం వారి ఆధ్వర్యములో తేదీ: 21-3-2020 శనివారం ఏ.పి.ఎస్.ఆర్.టి.సి రీజినల్ మేనేజర్ ఆఫీస్ నందు విశాఖపట్నం రీజియన్ లో ఉన్న అన్ని డెపోల పనిచేయుచున్న సుమారు 5500 ఏ.పి.ఎస్.ఆర్.టి.సి ఉద్యోగులకు మరియు వారి కుటంబాలకు మొత్తం 16,500 మందికి కరోనా వైరస్ వ్యాధి నిరోధక హోమియోపతి మందుల పంపిణీ కార్యక్రమము నిర్వహింపబడినది.

ఈ సందర్భముగా ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కన్వీనర్ డా ఆనంద కుమార్ పింగళి మాట్లాడుతూ: కరోనా వైరస్ ను ఎదురుకోవాలంటే ఆ వ్యాధిపట్ల అవగాహనా చాలా అవసరమని, వ్యక్తిగత పరిశుభ్త్రత తో పాటుగా వ్యాధి నిరోధక హోమియోపతి మందులు వాడటం వలన మనలో రోగనిరోధక శక్తి పెరుగుతుందని, దానివలన వైరస్ మనలో ప్రవేశించినా దానిని సులభంగా ఎదురుకోగలమని అన్నారు. హోమియోపతిక్ నిరోధక ఔషధం సురక్షితమైనదని ఇది శిశువులు, గర్భిణీ స్త్రీలు మరియు వృద్ధులతో సహా అందరూ తీసుకొనవచ్చు నని, ప్రతిరోజు ఉపయోగిస్తున్న ఇతర సాధారణ ఔషధాలతో పాటు దీనిని ఉపయోగించవచ్చునని అన్నారు. ఇప్పటి వరకు ఉభయ తెలుగు రాష్ట్రాలలో సుమారు తొమ్మిది లక్షల మందికి పైగా ఈ వ్యాధి నిరోధక గోళీలు పంపిణి చేసి, వ్యాధి పట్ల అవగాహన కల్పించామని అన్నారు. ఎవరికైనా సందేహాలు ఉన్నచో “కరోనా హోమియో హెల్ప్ లైన్ నెంబర్ 9866388979” నందు సంప్రదించవచ్చు అన్నారు.

ఈ కార్యక్రమములో ఏ.పి.ఎస్.ఆర్.టి.సి డిప్యూటీ CTM విశాఖపట్నం రూరల్ – కె.వెంకటరావు, DYCME విశాఖపట్నం రూరల్ – అప్పల నారాయణ, ATMDBS వి.ఎస్.ఎన్.మూర్తి, బస్ట్ స్టేషన్ సూపెర్వైసోర్స్ మరియు ట్రస్ట్ కార్యకర్తలు పి.మంజుల, కె. ప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు.

డాక్టర్ ఆనంద కుమార్ పింగళి, MD (హోమియో)
కన్వీనర్ – ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్, పిఠాపురం
Cell : 9866388979

 

News Clippings

http://www.uniindia.com/umar-alisha-trust-distributed-homoeopathy-medicine-preventive-medicine-for-coronavirus/south/news/1925500.html#

 

If you are interested to be part of this noble cause please use following link SBI – Online Donation to send your donations.

For more details please visit https://www.uardt.org/coronavirus/

Umar Alisha Rural Development Trust © 2015