Umar Alisha Rural Development Trust

Service to humanity is service to God

Coronavirus preventive medicine distributed by UARDT at Sri Jagannatha Swamy Temple, Visakhapatnam on 18-March-2020

Umar Alisha Rural Development Trust has distributed Coronavirus preventive Homeo medicine for free to 7000 people at Sri Jagannatha Swamy Temple, Visakhapatnam on 18-March-2020.

కరోనా వైరస్ వ్యాధి నిరోధక హోమియోపతి మందుల పంపిణీ

ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ – పిఠాపురం వారి ఆధ్వర్యములో తేదీ : 18-3-2020 బుధవారం నాడు విశాఖపట్నం, వన్ టౌన్ వద్ద గల జగన్నాధ స్వామి గుడి దగ్గర సుమారు 7000 మందికి కరోనా వైరస్ వ్యాధి నిరోధక హోమియోపతి మందుల పంపిణీ కార్యక్రమము నిర్వహింపబడినది.

ఈ సందర్భముగా ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కన్వీనర్ డా ఆనంద కుమార్ పింగళి మాట్లాడుతూ: ” కరోనా వైరస్ ను ఎదురుకోవాలంటే ఆ వ్యాధిపట్ల అవగాహనా చాలా అవసరమని అన్నారు.

క్రింద తెలిపిన విషయాలు గుర్తు పెట్టుకోవాలని అన్నారు .
1. వ్యక్తిగత పరిశుభ్త్రత – ముఖం , కాళ్ళు శుభ్రముగా సబ్బుతో కడుక్కోవడం.
2. పరిసరాల పరిశుభ్రత – మం పరిసరాలను పరిశుబ్రముగా ఉంచితే మం అందరి ఆరోగ్యం బాగుంటుంది.
3. వీటితో పాటుగా మనలో రోగనిరోధక శక్తి పెంపొందింపజేసే వ్యాధి నిరోధక హోమియోపతి మందులు వాడటం.
4. జనసమూహాలలో తీరుగ కుండా ఇంటి వద్దనే ఉండటం.
5. దగ్గు , జలుబు , జ్వరము ఉన్నవారు అశ్రద్ధ చేయకుండా డాక్టరుని సంప్రదించవలెను.

ఈ పైన చెప్పిన విషయాలు కానుక మనమందరము పాటించగలిగితే, ఈ కరోనా వైరస్ ను తరిమి కొట్టగలము అని అన్నారు.

హోమియోపతిక్ నిరోధక ఔషధం సురక్షితమైనదని ఇది శిశువులు, గర్భిణీ స్త్రీలు మరియు వృద్ధులతో సహా అందరూ తీసుకొనవచ్చు నని, ప్రతిరోజు ఉపయోగిస్తున్న ఇతర సాధారణ ఔషధాలతో పాటు దీనిని ఉపయోగించవచ్చునని అన్నారు . ఇప్పటి వరకు ఉభయ తెలుగు రాష్ట్రాలలో సుమారు ఎనిమిది లక్షల మందికి పైగా ఈ వ్యాధి నిరోధక గోళీలు పంపిణి చేసి , వ్యాధి పట్ల అవగాహన కల్పించామని అన్నారు.

ఎవరికైనా సందేహాలు ఉన్నచో “కరోనా హోమియో హెల్ప్ లైన్ నెంబర్ 9866388979 ” నందు సంప్రదించవచ్చు అన్నారు.

ఈ కార్యక్రమములో ట్రస్ట్ కార్యకర్తలు ఎ. ఆచారి, మంజుల, పి వి రామ రెడ్డి, ప్రకాష్, గిరీష్, పాల్గొన్నారు.

Coronavirus preventive medicine distributed by UARDT at Sri Jagannatha Swamy Temple, Visakhapatnam on 18-March-2020

 

News Paper Clippings

If you are interested to be part of this noble cause please use following link SBI – Online Donation to send your donations.

For more details please visit https://www.uardt.org/coronavirus/

Umar Alisha Rural Development Trust © 2015