Umar Alisha Rural Development Trust

Service to humanity is service to God

ది. 02 ఫిబ్రవరి 2020 ఆదివారం సజ్జాపురం గ్రామం, తణుకు పట్టణం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ‘నా మొక్క-నా శ్వాస’ కార్యక్రమము లో భాగంగా శ్రీ గారపాటి గోపాల్ రావు గారి (సబ్ ట్రెజరీ ఆఫీసర్) కుమారుడు శ్రీ గారపాటి శ్రీగణేష్ సత్య కిషోర్ గారి ఇంటివద్ద 60 గులాబీ మొక్కలు బాలలకు పంపిణీ చేసినారు

పర్యావరణ పరిరక్షణే ప్రజల ధ్యేయం, పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా సద్గురు వర్యుల ఆధేనుసారం ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యం లో “నా మొక్క-నా శ్వాస” “రేపటి తరం కోసం” కార్యక్రమములో భాగంగా తణుకు పట్టణం, సజ్జాపురం గ్రామంలొ శ్రీ గారపాటి గోపాల్ రావు గారి (సబ్ ట్రెజరీ ఆఫీసర్) కుమారుడు శ్రీ గారపాటి శ్రీగణేష్ సత్య కిషోర్ గారి స్వగృహం లో శ్రీస్వామి వారి ఆరాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 60 గులాబీ మొక్కలను బాలలకు పంపిణీ చేసినారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ కవి సాహితీ వేత్త శ్రీ ఎస్.ఆర్ భల్లం గారు పాల్గొన్నారు. “వృక్షో రక్షితి రక్షిత” అంటే మనం వృక్షాన్ని రక్షిత్తే మనందరినీ అది రక్షిత్తుందని. ఈ కార్యక్రమాన్ని గురువు ఆజ్ఞగా భావించి సబ్ ట్రెజరీ ఆఫీసర్ శ్రీ గారపాటిగోపాల్ రావు గారి కృషి అనుపమానమైయినది. ఇప్పటికి వివిధ ప్రాంతాల్లో 9 వందల మొక్కలు పంపిణీ చేసి గురు కృపకు పాత్రులయ్యారని, ఈ విధంగా భక్తులు అందరు ప్రయత్నించి జన్మ సార్థక్యత్వం పొందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్వామి సభ్యులు దర్శిపర్రు శ్రీ సాయిబాబా గారు తమ ప్రసంగాన్ని సభ్యులు కు వినిపించారు ఈ ఆరాధనకు పలు గ్రామాలనుండి కార్యకర్తలు శ్రీ దంగేటి వీరరాఘవులు గారు, శ్రీ తంగెళ్ళ త్రిమూర్తులు గారు, శ్రీ ముత్యాల రవి గారు, శ్రీ పుల్లా బాబి గారు, శ్రీ తాటిపర్తి రమాదేవి గారు, శ్రీ వడ్డే విజయలక్ష్మి గారు, శ్రీ దారపురెడ్డి చంద్ర గారు మరియు పీఠం సభ్యులు ఆరాధన కార్యక్రమంలో పాల్గొన్నారు.

05-Garapati-NaaMokkaNaSwasa-Sajjapuram-Tanuku-WG-AP-02022020

 

News Clippings

Umar Alisha Rural Development Trust © 2015