28 జులై 2019 ఆదివారం, డా౹౹ ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం సభ్యులు గోపాలరావు భువనేశ్వరి గార్ల దంపతుల నిర్వహణలో స్థానిక హుస్సేన్ జంక్షన్లో “రేపటి తరం కోసం – నా మొక్క నా శ్వాస” కార్యక్రమంలో భాగంగా హుస్సేన్ కూడలిలో రోడ్డు కిరువైపులా మున్సిపల్ ప్రాధమిక పాఠశాల ఆవరణలో మొక్కలను నాటారు. గణపవరం ఎం.ఈ.ఓ శేషు గారు, ప్రభుత్వ పెన్షనర్ల అసోసియేషన్ అధ్యక్షులు దాసం నాగేశ్వరరావు గారు, స్థానిక పీఠం సభ్యులు తంగెళ్ల త్రిమూర్తులు గారు, షాబాబు గారు, రామకృష్ణ గారు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ పిఠాపురం పీఠాధిపతి డా౹౹ ఉమర్ ఆలీషా గారు ఆధ్యాత్మిక ప్రవచనాలతో పాటుగా పర్యావరణ పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యత నిచ్చి ప్రతి ఒక్కరు మూడు మొక్కలు నాటి సంరక్షణ చేయాలని ఆదేశించారు. ప్రతి ప్రభుత్వోన్నత పాఠశాలల్లోను, ప్రభుత్వ భూముల్లోను మొక్కలను నాటి సంరక్షణ చేయడాన్ని అభినందించినారు.మొక్కలను పెంచేవారు ప్రాణవాయువు దాతలని తాడేపల్లిగూడెం ఉప ఖజానాధికారి గారపాటి గోపాలరావు గారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అల్లంపురం హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు రామరాజు గారు, పెన్షనర్ల అసోసియేషన్ ఉపాధ్యక్షులు కర్రి సూరెడ్డి గారు, సెక్రటరీ కె.బాలకృష్ణ గారు, కోశాధికారి ఎం.అర్జునరావు గారు, సభ్యులు బి.సత్యనారాయణ రాజు గారు మరియు ఉపకార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
UARDT Activities
News Archives
M | T | W | T | F | S | S |
---|---|---|---|---|---|---|
1 | ||||||
2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 |
9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 |
16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 |
23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 |
30 | 31 |