Umar Alisha Rural Development Trust

Service to humanity is service to God

Coronavirus preventive medicine distributed by UARDT at Zilla Parishad High School, Kesavaram Village 09-March-2020

Umar Alisha Rural Development Trust has distributed Coronavirus preventive Homeo medicine for free to 1050 people at Zilla Parishad High School, Kesavaram Village on 09-March-2020.

పశ్చిమ గోదావరి జిల్లా కేసవరం
జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాల, కేసవరం గణపవరం మండలం నందు ది 9.3.2020 సోమవారం నాడు కరోనా వైరస్ నిమిత్తం విద్యార్ధిని విద్యార్థులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా తాడేపల్లిగూడెం ఉప ఖజానా అధికారి శ్రీ గరపాటి గోపాలరావు గారి దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సదస్సులో ప్రధానోపాధ్యాయులు గారు శ్రీ ఎం.వి.యస్.యస్.రమంజనేయులు అధ్యక్షత వహించారు.
ఈ వ్యాధి లక్షణాలు జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, ముక్కునుండి నీరు కారడం, దగ్గినప్పుడు తుమ్మినప్పుడు నోటికి అడ్డుగా చేతి రుమాలు పెట్టుకోవాలని తెలిపారు. ఈ లక్షణాలు ఉన్నవారు అశ్రద్ధ చేయకుండా వైద్యులను సంప్రదించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఎస్.టి.ఒ గారపాటి గోపాల్ రావు గారు మాట్లాడుతూ ఈ వ్యాధి ఎలా వ్యాపిస్తుంది కరోనా వైరస్ రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి సూచనలు వివరించారు. చల్లగా ఉండే ప్రాంతాల్లో కరోనా వైరస్ ఎక్కువగా వస్తుందని కావున ప్రతి ఒక్కరు ఏసీలు, ఫ్రిజ్ లు వాడకం, జనసమ్మర్ద ప్రదేశాల్లో మరియు ప్రయాణాల్లో ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది కనుక మాస్కు ధరించి ప్రయాణం చేయాలని అని సూచించారు. ఉమర్ ఆలీషా రురల్ డెవలప్మెంట్ ట్రస్ట్ పిఠాపురం వారు పంపిన హోమియోపతి మందులను యస్.టి.ఒ (తాడేపల్లిగూడెం) గారపాటి గోపాలరావు, వారి శ్రీమతి గారపాటి భువనేశ్వరి మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ ఎం.వి.యస్.యస్. రామంజనేయులు గారు, శ్రీ యన్.సత్యనారాయణ (పి.డి ) గారు మరియు ఉపాధ్యాయ సిబ్బంది ద్వారా విద్యార్థిని విద్యార్థులకు ఒక ప్యాకెట్ ముగ్గురికి చప్పున 350 ప్యాకెట్స్ అనగా 1050 మందికి మందులు పంపిణీ చేశారు.
ఇట్లు
ప్రధానోపాధ్యాయులు
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల
కేశవరం

Coronavirus preventive medicine distributed by UARDT at Zilla Parishad High School, Kesavaram Village 09-March-2020

 

Paper Clipping

For more details please visit https://www.uardt.org/coronavirus/

Umar Alisha Rural Development Trust © 2015