Umar Alisha Rural Development Trust has distributed Coronavirus preventive Homeo medicine for free to 600 students at Zilla Parishad High School, Manchili on 10-March-2020.
పశ్చిమ గోదావరి జిల్లా మంచిలి
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మంచిలి, అత్తిలి మండలం నందు ది.10.3.2020 మంగళవారం నాడు ఈ కార్యక్రమంలో భాగంగా తాడేపల్లిగూడెం ఉప ఖజానా అధికారి శ్రీ గారపాటి గోపాలరావు గారి దంపతుల ఆధ్వర్యంలో కరోన వైరస్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ప్రధానోపాధ్యాయులు గారు శ్రీ నాగమణి గారు అధ్యక్షత వహించారు. హెచ్.ఎమ్ గారు మాట్లాడుతు యస్.టి.ఓ. గోపాలరావు గారు నిత్యం గురువుగారి ఆదేశాలను పాటిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ అంటూ “నా మొక్క నా శ్వాస” అని మంచి కార్యక్రమం మా పాఠశాలలో ట్రస్ట్ తరపున ౫౦౦ మొక్కలను ఇచ్చారు. ఇప్పుడు కరోనా వైరస్ మందులు ఇవ్వడం చాలా మంచి విషయం ఇలాంటి ఉద్దేశంతో నడిపిస్తున్నటువంటి పీఠంకి నా ధన్యవాదాలు అని తెలిపారు. శ్రీ రాగిరెడ్డి రాజేంద్రప్రసాద్ గారు మాట్లాడుతూ మంచిలి ఇదే పాఠశాలలో నేను అరవ శ్రీరాములు మాస్టారు గారి దగ్గర చదువుకున్నాను. ఆ మాస్టారు గారి అమ్మాయి భువనేశ్వరి, వారి అల్లుడు గోపాలరావు గారు స్వామి సేవలో ఉండడం ఈ ఊరికి మొక్కలు పంపిణీ, మజ్జిగ చలివేంద్రం, ఇప్పుడు కరోనా వైరస్ మందుల పంపిణీ అన్నీ విశేష సేవలు అందిస్తున్నారు. ఈ పీఠానికి గోపాల్రావు గారు మంచి గౌరవం, పేరును తీసుకువస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎస్.టి.ఒ గారపాటి గోపాల్ రావు గారు మాట్లాడుతు మానవ సేవయే
మాధవ సేవగా స్వామి గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలు చేయటం వల్ల ఈ పీఠం ఇంకా వెలుగులోకి తీసుకురావాలని నా కోరిక. అక్షరజ్యోతి, శిశు సంక్షేమం, నా మొక్క నా శ్వాస, చలివేంద్రాలు, స్త్రీలకు కుట్టు మిషన్ పంపిణీలు ఇలా వివిధ సేవలు ఈ పీఠం అందిస్తుంది అని తెలిపారు. ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ పిఠాపురం వారు పంపిన హోమియోపతి మందులను యస్.టి.ఒ (తాడేపల్లిగూడెం) గారపాటి గోపాలరావు గారు, వారి శ్రీమతి గారపాటి భువనేశ్వరి మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగమణి గారు, ఉపాధ్యాయ సిబ్బంది, పీఠం సభ్యులు శ్రీ దంగేటి రామకృష్ణ గారు, శ్రీ కటికిరెడ్డి షాబాబు గారు, గ్రామ ప్రముఖులు శ్రీ రాగిరెడ్డి రాజేంద్రప్రసాద్ గారు, శ్రీ సత్తి శ్రీనివాస రెడ్డి గారు, శ్రీ సీతల అప్పారావు గారు, శ్రీ సత్తిపండు రెడ్డి గారు, మరియు పేరెంట్స్ కమిటి ఛైర్మెన్ శ్రీ యర్రంశెట్టి శ్రీనివాస్ గారు, ఇతర సభ్యుల చేతుల మీదుగా జరిగింది. విద్యార్థిని విద్యార్థులకు 600 మందికి మందులు పంపిణీ చేశారు. ప్రధానోపాధ్యాయులు నాగమణి గారు ట్రస్ట్ వార్కి ఈ కార్యక్రమం నిర్వహించినందులకు కృతజ్ఞతలు తెలియజేయడమైనది.
For more details please visit https://www.uardt.org/coronavirus/