నా మొక్క నాశ్వాస – రేపటి తరం కోసం
శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి డా౹౹ ఉమర్ ఆలీషా సద్గురు వర్యుల ఆదేశాల మేరకు తాడేపల్లిగూడెం సబ్ ట్రెజరీ ఆఫీసర్ శ్రీ గారపాటి గోపాలరావు గారు, శ్రీ భువనేశ్వరి గార్ల దంపతుల సౌజన్యంలో గురు పూజోత్సవం సందర్భంగా సబ్ ట్రెజరి ఆఫీస్ ఎదురుగా మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప ఖజానాధికారి శ్రీ గారపాటి గోపాలరావు గారు మాట్లాడుతూ మొక్కలు మానవులకు ఆక్సిజన్, ఫలాలను, నీడను నిస్వార్థంగా ఇస్తాయి అదే విధంగా మానవులు కూడా పరులకోసం సేవ చెయ్యాలని అన్నారు. విశ్రాంత ఉద్యోగుల అధ్యక్షులు శ్రీ దాసం నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలని అన్నారు. మాజీ ఉపఖజానాధికారి శ్రీ బి. హరి కుమార్ గారు మాట్లాడుతూ వృక్షాలను ఘనం రక్షిస్తే అవి మనలను రక్షిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ ట్రెజరీ సిబ్బంది మరియు పీఠం సభ్యులు శ్రీ కట్రెడ్డి షాబాబు గారు మరియు విశ్రాంతి ఉద్యోగుల సంఘం సెక్రటరీ శ్రీ బాలకృష్ణ గారు, శ్రీ అర్జునరావు గారు, శ్రీ దంగేటి సూర్యనారాయణ గారు, శ్రీ కృష్ణకుమారి గారు తదితరులు పాల్గొన్నారు.
Video
https://drive.google.com/open?id=1utjIcrsEzix2RicMrsWbH9dO4SH3Fand