పర్యావరణ పరిరక్షణలో భాగంగా శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం తాడేపల్లిగూడెం శాఖ వారి ఆధ్వర్యంలో అత్తిలి మండలం మంచిలి గ్రామంలోని జడ్పీ హైస్కూల్ నందు ది.14 ఆగష్టు 2019 బుధవారం రోజు “నామొక్క – నాశ్వాస” కార్యక్రమములో మొక్కలు నాటారు. తాడేపల్లిగూడెం శ్రీ ఎస్.టి.ఓ గారపాటి గోపాలరావు గారు మాట్లాడుతు చెట్లు పరులకోసం పుష్పాలు, ఫలాలు, ఆక్సిజన్ నిస్వార్థంగా ఇస్తాయని మరియు వర్షాలు సకాలంలో కురవడానికి దోహదపడతాయని అన్నారు. వృక్షాలు వాయు కాలుష్యం నివారించి పర్యావరణం బాగుపడడానికి దోహదం చేస్తాయన్నారు. అలాగే ప్రతి మానవుడు నిస్వార్థంగా తనకున్న కాలంలో పరులకోసం సేవ చెయ్యాలన్నారు. ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యయిని శ్రీ జి. నాగమణి గారు మాట్లాడుతూ మొక్కల యొక్క ప్రయోజనాలను వివరించారు. వారు మరియు వారి పాఠశాల సిబ్బంది ఎంతో సంతోషాన్ని వ్యక్త పరిచారు. ఈ కార్యక్రమంలో పీఠం సభ్యులు శ్రీ ఎస్.టి.ఓ గారపాటి గోపాలరావు గారు, శ్రీ భువనేశ్వరి గారు, శ్రీ కట్రెడ్డి షాబాబు గారు, శ్రీ దారపురెడ్డి వెంకన్న గారు, శ్రీ చంద్ర గారు గారు, మంచిలి గ్రామ పెద్దలు శ్రీ లోవా రెడ్డి గారు, శ్రీ కేతా నరసింహమూర్తి గారు మరియు పీఠం సభ్యులు పాల్గొన్నారు.
UARDT Activities
News Archives
M | T | W | T | F | S | S |
---|---|---|---|---|---|---|
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 |
8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 |
15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
29 | 30 | 31 |
Search Articles
News Updates
- కాకినాడ రోటరీ క్లబ్ మరియు రోటరీ బ్లడ్ బ్యాంక్ అధ్వర్యంలో బుధవారం 29-06-202 శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం తరపున కన్వీనర్ శ్రీ పేరూరి సూరిబాబు గార్ని సన్మానించి అభినందించారు.
- SASYA VRUDHI BEEJAROPANOTSAVAM| సస్య వృద్ది బీజారోపణోత్సవం | 14th June 2022
- 05 జూన్ 2022 నూతన ఆశ్రమ ప్రాంగణం లో ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన “ప్రపంచ పర్యావరణ దినోత్సవం” ర్యాలీ
- 05 జూన్ 2022 “ప్రపంచ పర్యావరణ దినోత్సవం” సందర్భంగా కాకినాడ శాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కలు నాటే కార్యక్రమం జరిగినది
- పిఠాపురం నూతన ఆశ్రమం లో 26 మే 2022 న నక్షత్రవనం ప్రారంభోత్సవం జరిగినది