Umar Alisha Rural Development Trust

Service to humanity is service to God

Coronavirus preventive medicine distributed by UARDT at L.Agraharam Peetham Ashram, Tadepalligudem on 20-March-2020

Umar Alisha Rural Development Trust has distributed Coronavirus preventive Homeo medicine for free to 1500 people at L.Agraharam Peetham Ashram, Tadepalligudem on 20-March-2020.

కరోనా వైరస్ అవగాహన మరియు హోమియో వ్యాధి నిరోధక మందులు పంపిణీ
ది.20-03-2020 శుక్రవారం తాడేపల్లిగూడెం మండలం య.ల్ అగ్రహారం గ్రామంలో శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా సద్గురువర్యుల ఆదేశాలమేరకు ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గ్రామ కమిటి సభ్యురాలు శ్రీ దారపురెడ్డి చంద్ర గారు గ్రామ పెద్దల సమక్షంలో ప్రజలందరికి కరోనా వైరస్ అవగాహన సదస్సు మరియు హోమియో వ్యాధి నిరోధక మందుల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమంలో సబ్ ట్రెజరీ అధికారి శ్రీ గారపాటి గోపాలరావు గారు మాట్లాడుతూ ప్రతి వంద సంవత్సరాలకు ఏదో వక వ్యాధి వచ్చి ప్రపంచ దేశాల్ని వణికిస్తుంది. 1720లో ప్లేగు వ్యాధి, 1820లో కలరా వ్యాధి, 1920లో మేర్స వ్యాధి, ఇప్పుడు 2020లో కరోనా వ్యాధి వచ్చియున్నవి. ఈ కరోనా వ్యాధి నిరోధానికి చేతులు శుభ్రంగా కడుక్కోవడం, దగ్గు, రోంప ఉన్నవాళ్ళు మాస్క్ ధరించడం, మనిషికి మనిషికి ఓక మీటరు దూరం ఉండాలని అన్నారు.
గ్రామ కన్వీనర్ శ్రీ దారుపురెడ్డి చంద్ర గారు మాట్లాడుతు గత సంవత్సరం మా య.ల్ అగ్రహారం గ్రామములో యస్.టి.ఒ గారపాటి గోపాలరావు గారు “నా మొక్క నా శ్వాస” అనె కార్యక్రమం ద్వార 200 మొక్కలు నాటారు. ఇప్పుడు ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వార గ్రామ ప్రజలకు 1500 మందికి కరోన వైరస్ వ్యాధి నిరోధక మందులను పంచడం ఆనందదాయకమన్నారు.
ఈ కార్యక్రమంలో పీఠం సభ్యులు శ్రీ తోట సత్యనారాయణ గారు, శ్రీ కట్రెడ్డి షాబాబు గారు, శ్రీమతి గారపాటి భువనేశ్వరి గారు, శ్రీ దారుపురెడ్డి చిన్న వెంకన్న గారు, శ్రీ దారుపురెడ్డి శాంత కుమారి గారు, మాజీ గ్రామ సర్పంచి కొత్తపల్లి శ్రీ నరసింహమూర్తి గారు, (వై.ఎస్.ఆర్.సి.పి నాయకుడు) శ్రీ కొత్తపల్లి ప్రసాద్ గారు, పీఠము సభ్యులు పాల్గొన్నారు.
ఇట్లు
శ్రీ విశ్వ విజ్ఞాన ఆధ్యాత్మిక పీఠము,
గ్రామ కన్వీనర్,
శ్రీ దారుపురెడ్డి చంద్ర గారు,
యల్.అగ్రహారం.

If you are interested to be part of this noble cause please use following link SBI – Online Donation to send your donations.

For more details please visit https://www.uardt.org/coronavirus/

Umar Alisha Rural Development Trust © 2015