Umar Alisha Rural Development Trust

Service to humanity is service to God

Coronavirus preventive medicine distributed by UARDT at Tadepalligudem Taluka, Railway Goods Shed, Workers Union, Tadepalligudem on 20-March-2020

Umar Alisha Rural Development Trust has distributed Coronavirus preventive Homeo medicine for free to 800 people at Tadepalligudem Taluka, Railway Goods Shed, Workers Union, Tadepalligudem on 20-March-2020.

కరోనా వైరస్ అవగాహన మరియు హోమియో వ్యాధి నిరోధక మందులు పంపిణీ
శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా సద్గురువర్యుల ఆదేశాల మేరకు డా. ఉమర్ ఆలీషా రురల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆద్వర్యంలో ది.20-03-2020 శుక్రవారం తాడేపల్లిగూడెం తాలూకా రైల్వే గూడ్స్ షెడ్ వర్కర్స్ యూనియన్ వద్ద కరోన వైరస్ నివారణ మాత్రలు ఉపఖజానదిపతి శ్రీ గారపాటి గోపాలరావు గారు 800 మందికి పంపిణి చేసినారు వారు మాట్లాడుతు ఈ వైరస్ వ్యాధి నివారణ పద్ధతులు ప్రాధమికంగా తీసుకోవలసిన జాగ్రత్తలు మరియు ఈ మందులు వేసుకునే విధానం అర్ధమయ్యేలాగా వివరించారు. ఈ వ్యాధిని అరికట్టాలంటే ప్రతి ఒక్కరు తగు జాగ్రత్తలు పాటించాలని కోరారు. యూనియన్ అధ్యక్షకార్యదర్సులు శ్రీ సత్తికోదండ రామిరెడ్డి గారు, శ్రీ చిర్లపుల్లారెడ్డి గారు మాట్లాడుతూ ఈ కరోనా వైరస్ చైనా లో ప్రారంభమైన వ్యాధి 165 దేశాలకు పాకిందని ఈ వ్యాధి వలన 8వేల మంది చానిపోయారని అధికారలెక్కలు చెబుతున్నాయని తెలిపారు. మనదేశంలో అన్ని రాష్ట్రాలకు పాకిందని దీనికి మనదేశంలో మందులు కొరత లేదని తెలిపారు. ఈ వ్యాధి ప్రబలకుండా అన్ని ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య కేంద్రాలకు మందులు పంపిణీ చేసి ప్రజల ప్రాణాలు కాపాడాలని కోరారు. అసంఘటితరంగాల్లో పని చేసే కర్మికులను ఈ కరోనా వల్ల పనులు లేక ఇబ్బందులు పడుతున్నారని ఈ రంగం లో పనిచేస్తున్న కార్మికులకు ఆర్థిక సహాయం ప్రభుత్వం అందించి ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీ యస్.వి.రెడ్డి గారు, శ్రీ మద్దాల పుత్రయ్య గారు, శ్రీ కర్రీ సుబ్బిరెడ్డి గారు, శ్రీ అడపా ఆంజనేయులు గారు, శ్రీ మెడపా టేకురెడ్డి గారు, శ్రీ ఆకుల నారాయణ గారు, శ్రీ కర్రీ సాయిరెడ్డి గారు, శ్రీ యాండ్రాపు కృష్ణ గారు, శ్రీ తేతలి నాగిరెడ్డి గారు తదితరులు పాల్గొని ప్రసంగించారు.
ఇట్లు
శ్రీ చిర్లపుల్లారెడ్డి గారు,
తాడేపల్లిగూడెం.

If you are interested to be part of this noble cause please use following link SBI – Online Donation to send your donations.

For more details please visit https://www.uardt.org/coronavirus/

Umar Alisha Rural Development Trust © 2015