Umar Alisha Rural Development Trust has distributed Coronavirus preventive Homeo medicine for free to 600 students at Zilla Parishad High School (ZPHS), Kaikaram Village, Unguturu Mandal on 04-March-2020.
ది. 4.మార్చి 2020 బుధవారం పశ్చిమ గోదావరి జిల్లా కైకరం గ్రామంలొ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కైకరం నందు తాడేపల్లిగూడెం ఉప ఖజానా కార్యాలయం అధికారి శ్రీ గారపాటి గోపాలరావు గారు దంపతులు కరోనా వైరస్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సు ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధానోపాధ్యాయులు శ్రీ టి.వి రామకృష్ణ గారు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ గోపాల్ రావు గారు మాట్లాడుతూ చల్లగా ఉండే ప్రాంతాల్లో కరోనా వైరస్ ఎక్కువగా వస్తుందని కావున ప్రతి ఒక్కరు ఏసీలు, ఫ్రిజ్ లు వాడకం, జనసమ్మర్ద ప్రదేశాల్లో మరియు ప్రయాణాల్లో ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది కనుక మాస్కు ధరించి ప్రయాణం చేయాలని అని సూచించారు. నాన్ వెజ్ ఆహారపదార్థాలు, టీలు, కాఫీలు మానేయాలి అని తెలిపారు. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు నోటికి అడ్డుగా చేతి రుమాలు పెట్టుకోవాలని తెలిపారు. ఈ వ్యాధి లక్షణాలు జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, ముక్కునుండి నీరు కారడం, గొంతు నొప్పివంటి లక్షణాలు ఉంటాయని, ఈ లక్షణాలు ఉన్నవారు అశ్రద్ధ చేయకుండా వైద్యులను సంప్రదించాలని కోరారు. తదనంతరం కరోనా వైరస్ నివారణకు హోమియో మందులు 600 మంది విద్యార్థులకు పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ పుప్పాల గోపి గారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు వ్యక్తి గత పరిశుభ్రత పాటించాలని తెలిపారు. ప్రధానోపాధ్యాయులు శ్రీ టి.వి. రామకృష్ణ గారు మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ కరచాలనం మానివేసి, భారతీయ సంప్రదాయం అయిన రెండు చేతులు జోడించి నమస్కారం చేయాలని తెలిపారు. విద్యా కమిటీ సభ్యులు శ్రీ కూన అప్పారావు గారు మాట్లాడుతూ చేతులను ప్రతి రెండు గంటలకు ఒకసారి సబ్బుతో కడుక్కోవాలి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ శ్రీ నాగరాజు గారు, వైస్ చైర్మన్ శ్రీ సత్యనారాయణ గారు, శ్రీ పైడి కనకదుర్గ కుకునూరి శివ గారు పాల్గొన్నారు.
For more details please visit https://www.uardt.org/coronavirus/